
telugu galam news e69news local news daily news today news
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వామి ఇక్కడ ఉన్న నారసింహ స్వామి లీలలు అద్భుతం ముడుపులు కట్టడం అంటే మనలో ఉన్న మాలిన్యాలను వదలడమే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ మూర్తిని సోమవారం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీమాన్ రంగరాజన్ స్వామి దర్శనం చేసుకోవడం జరిగినది. ఈ సందర్బంగా స్వామి మాట్లాడుతూ ఇక్కడ కొలువై ఉన్న కల్పవృక్ష నారసింహ సాలగ్రామం చాలా విశేషమైనదని సాక్షాత్తు లక్ష్మీనారసింహుడు ప్రసాధితమైనదని అన్నారు.ఇక్కడ ముడుపులు కడితే మంచిదని ఒక్కో భగవంతునికి ఒక్కో విశేషం ఉంటుందని అలానే కల్పవృక్ష నారసింహ స్వామికి ముడుపులు కట్టడమనేది ప్రాశస్థ్యమని అన్నారు. అలానే భగవంతుడు మనకోసం భువిలో కొలువై ఉన్నాడనడానికి ఇదే నిదర్శనమని ఇంతటి మహిమాన్వితమైన కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దర్శనం మా పూర్వజన్మ సుకృతమని అన్నారు.దర్శనం కొరకు వచ్చిన రంగారాజన్ స్వామి కి ఆశ్రమం నిర్వాహకులు డా. కృష్ణ చైతన్య స్వామి ఆలయ మర్యాదలతో సత్కరించడం జరిగినది.