ఈ69న్యూస్ జఫర్ఘడ్
గురువారం జనగామ కలెక్టర్ కార్యాలయం ముందు రైతు సమస్యలపై జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం మండల నాయకులు వడ్లకొండ సుధాకర్ ఒక ప్రకటన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ముందు చూపు లేక వరి,మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయన్నారు.ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందస్తుగా ప్రాజెక్టులు నింపి ద్వారా చెరువులు కుంటలు నింపితే భూగర్భ జలాలు పెరిగి పంటలకు సాగునీరు అందే అవకాశం ఉండేది అన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేలల్లో పెట్టుబడులు పెట్టి రైతులు పంట సాగు చేస్తే తీర చేతికి వచ్చే సమయానికి నీరంధక పంట ఎండిపోతుందన్నారు.దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది అన్నారు.కావున తక్షణమే ప్రభుత్వము అధికారులు స్పందించి ప్రాజెక్టుల ద్వారా చెరువు గుంటలు నింపాలన్నారు.అట్లాగే ఎండిన పంట పొలాలను అధికారుల బృందం సర్వే చేసి ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించి రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
