
కార్మిక రాజ్య స్థాపన కోసం సిఐటియు పోరాటం
సిఐటియు జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు~~~~
రఘునాథపల్లి : మే 30/05/2024 రోజు న సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయం వద్ద సీఐటీయు ఆవిర్భవ దినోత్సవం పురస్కరించుకొని సిఐటి జెండా ను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు ఆవిష్కరించారు అందరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంచు విజేందర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు పాల్గొని మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా సిఐటియు సమరశీల కార్మిక పోరాటాలు నిర్వహించి దోపిడీ యాజమాన్యాలను ఎదిరించి కార్మిక వర్గానికి అండదండగా ఉన్నదన్నారు 1970 మే 30న భారతదేశ కార్మిక వర్గానికి ఐక్యత పోరాటం అనే నినాదంతో సిఐటియు ఆవిర్భవించిందని అన్నారు సి ఐ టి యు గా 52 సంవత్సరాల కాలంలో కేంద్రంలో రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న పాలక వర్గాలపై చారిత్రాత్మక సమ్మె పోరాటాలు నిర్వహించి కార్మిక వర్గానికి మనోధైర్యాన్ని కల్పించి కార్మికుల హక్కుల సాధన కోసం దిక్సూచిగా సీఐటీయూ నిలిచిందన్నారు బీజేపీ అధికారంలోకి వచ్చినా ఎనిమిదేళ్ల కాలంలో స్వాతంత్రం పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలకు పాతరేసి ఈ దేశంలో బడా కార్పొరేట్ శక్తులు కార్మికుల శ్రమ శక్తిని యధేచ్ఛగా శ్రమదోపిడి చేసేందుకు నాలుగు లేబర్ కోడ్ లు తీసుకొచ్చారని విమర్శించారు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు కార్మిక వర్గం భారత పాలక వర్గాలపై పెట్టుబడిదారుల పై పోరాటాలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందని కార్మిక వర్గం ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు తాండ్ర ఆనందం బూడిద ప్రశాంత్ పట్టణ నాయకులు మల్లేష్ రాజ్ చిదిరాల ఉపేందర్ చిర్ర శ్రీనివాస్ బి నవీన్ తదితరులు పాల్గొన్నారు