
ఈ69న్యూస్ హన్మకొండ/స్టేట్ బ్యూరో రిపోర్టర్ ముహమ్మద్ సలీం
హనుమకొండ: జిల్లాలో ఇంకా ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలను 2–3 రోజుల్లో ప్రారంభించాలని కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రైతులకు ఇబ్బంది లేకుండా సజావుగా కొనుగోలు సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గన్ని సంచుల కొరత, ధాన్యం రవాణాలో సమస్యలు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.