చైర్మన్ పదవి కొనుగోలు ఆరోపణలపై స్పందించిన పొట్లపల్లి శ్రీధర్ రావు
ఈ69న్యూస్ జనగామ/చిల్పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్గా పదవి నిర్వర్తిస్తున్న పొట్లపల్లి శ్రీధర్ రావు,పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..”గత ప్రభుత్వంలో రెండు సార్లు చైర్మన్ పదవిని నాకు ఇచ్చింది నీవే రాజన్న.అప్పుడు నాకు అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా ఇస్తే,ఇప్పుడు అదే పదవిని నేను కొనుక్కున్నానని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది,”అని విమర్శించారు.శ్రీధర్ రావు వివరిస్తూ..తాత్కాలిక చైర్మన్ పదవీ కాలం పూర్తైన రెండు నెలల తర్వాత మండల సమన్వయ కమిటీ,ఇతర నాయకుల సమన్వయంతో తనకు పదవి అందిందని చెప్పారు.“పదవులు కొనుక్కోవాల్సిన అవసరం నాకు లేదు.నా గ్రామానికి అతి దగ్గరలో ఉన్న దేవస్థాన అభివృద్ధే నా లక్ష్యం” అని అన్నారు.ఈ సందర్భంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డమీది సురేష్ మాట్లాడుతూ..”డాక్టర్ రాజయ్య మాట్లాడే తీరు దొంగే దొంగ అన్నట్లు ఉంది.గతంలో మేము నిన్ను గెలిపించేందుకు ఎంతో కృషి చేశాం.కానీ నీవే మమ్మల్ని మార్గమధ్యంలో వదిలావు.కోణాచలం భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించినప్పటికీ మేము ఉద్యమించి వాటిని కాపాడాం” అని ఆరోపించారు.ఇదే సందర్భంగా,చైర్మన్ పదవిని కొనుగోలు చేశారన్న ఆరోపణలు శ్రీధర్ రావు వంటి మృదుస్వభావి,సేవాభావంతో ముందుకెళ్తున్న నేతకు తగవని తెలిపారు.“ఆయన గురించి చిన్న పిల్లల నుండి ముసలివాళ్ళ వరకు ఎవరు అయినా అడిగినా మంచితనం గురించే చెబుతారు.పదవులు అమ్ముకున్న చరిత్ర మీకే ఉంది” అని సురేష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు శిరీష సురేష్,వెన్నకుస కుమార్,చిర్ర నాగరాజు,మాజీ సర్పంచులు,యూత్ అధ్యక్షులు,దేవస్థాన డైరెక్టర్లు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.