
నన్ను ఆశీర్వదించండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా-కడియం
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు…తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం,కేసిఆర్ నాయకత్వంలోనే జరిగిందని అన్నారు.వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకే వస్తుందని వెల్లడించి,నియోజక ప్రజలు ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.నేను తప్పుచేయను నియోజక వర్గానికి చెడు పేరును తేను,నేను వస్తే అవినీతి పరులకు భయం,నేను వస్తున్నా అంటే గోకే వారు గీకేవారు భూ కబ్జా దారులు పారీపోవాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.స్టేషన్ ఘనపూర్ ను మున్సిపాలిటీగా చేసి అభివృద్ధి చేస్తానని తనను ప్రజలు ఆశీర్వదించాలని కరారు.ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన బీజేపీ పార్టీ నుండి పలువురు
కడియం శ్రీహరి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.