
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు డిమాండ్
*సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు డిమాండ్
ఈ69న్యూస్ రఘునాథపల్లి
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ బైపాస్ రహదారిలో ఉన్న బావిని వెంటనే పూడ్చివేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దివి.08-03-2025 శనివారం రోజున నిడిగొండ సిపిఎం మండల కమిటీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ బావిని పరిశీలించడం జరిగింది.అనంతరం రాజు మాట్లాడుతూ..నిడిగొండ గ్రామంలో జాతీయ రహదారికి ఆనుకొని నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ బావి ప్రమాదకరంగా ఉందని హనుమకొండ నుండి వేగంగా వాహనములు అదుపుతప్పి పడిపోయే అవకాశం ఉందని గతంలో పలుమార్లు అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పెను ప్రమాదం జరగక ముందే అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని బావిని పూడ్చాలని లేదంటే బావికి అడ్డంగా గోడ నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో గ్రామ ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్యమాలు చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ మండల కమిటీ సభ్యులు నామాల యాదగిరి కడారి ఆంజనేయులు గోపగోని వెంకటేశ్వర్లు తూడి ఐలయ్య బండారు యాదగిరి లింగాల రవి ఉరడి రాజు మామిడాల సిద్ధులు తోకల వెంకట్ రెడ్డి అలాగే బి ఆర్ ఎస్ నాయకులు బొంగు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు