
పదవి బాధ్యతలు స్వీకరించిన ఆర్టీసీ డిపో మేనేజర్ కి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ టీయస్ ఆర్టీసీ వరంగల్ -1డిపో మేనేజర్ నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన డిపో మేనేజర్ వెంకటేశ్ గారికి భారత రాష్ట్ర సమితి అనుబంధ విద్యార్థి విభాగం బిఆర్ఎస్వీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి నాయక్ డిపో మేనేజర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం లకావత్ చిరంజీవి నాయక్ మాట్లాడుతూ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు వివిధ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో సర్వీసులు లేకపోవడంతో విద్యార్థులు దూరప్రాంతాల నుండి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరం అయ్యే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. కళాశాలకు, పాఠశాలకు ఉన్నత చదువులు చదువుకోవడానికి వెళ్లాలంటే ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేయడానికి నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. వివిధ గ్రామాల నుండి విద్యార్థులు, వ్యాపారులు, రైతులు ఘనపూర్ డివిజన్ కేంద్రానికి రావాలంటే భారీ మొత్తంలో ప్రైవేట్ వాహనాల్లో అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నాయని అన్నారు. గత్యంతరం లేక తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లో వెళ్లడం తప్పడం లేదని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాలకు రోడ్ సర్వే చేయించి విద్యార్థుల సౌకర్యం కొరకు బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ గారికి కోరారు.