ఎస్సీ జాబితాలో చేర్చాలంటే రాజ్యాధికారంతోనే సాధ్యం:: జూపల్లి సత్యనారాయణఎస్సీ జాబితాలో చేర్చాలంటే రాజ్యాధికారంతోనే సాధ్యం:: జూపల్లి సత్యనారాయణ

ప్రభుత్వ కళాశాలలో హిందీ అధ్యాపకులుగా పనిచేస్తునే రజక కులస్తుల చైతన్యం కోసం ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ కోసం 45 సం.లుగా సుదీర్ఘంగా పోరాటం చేసిన త్యాగమూర్తిగా గుర్తించి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి 2018 సం.”రజక త్యాగి” అవార్డు ఇచ్చి సన్మానింపబడిన త్యాగపురుషుడి స్వగృహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు వెళ్లి జూపల్లి సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి వెంకటయ్య. వారు నడవలేని స్థితిలో ఉండటం చాలా బాధాకరమని త్వరగా కోలుకోవాలని ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జాతికి సేవలందించాలని కోరుకుంటున్నాం. రజక కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాల్లన్న అంశంపై స్పందిస్తూ రజక నాయకుడు బలమైన వాడై ఉంటు రాజకీయ బలం ఉండాలని లేదా మనవాళ్లు రాజకీయాల్లో రాణించి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటే అసెంబ్లీలో గాని పార్లమెంట్లో గాని పదేపదే ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని లేవనెత్తి ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కావున బలమైన రాజకీయ నాయకులుగా ఎదగాలని ఆ దిశగా అడుగులు పడాలని జాతిని కోరారు.ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న రజక నాయకులు ఏకమై ఎస్సీ ఆవశ్యకతను ప్రజలకు వివరించి చైతన్యం చేసి బలమైన ఉద్యమంగా రూపకల్పన చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని రజక యువతను మేధావులను న్యాయవాదులను కళాకారులను జర్నలిస్టులను మహిళలను వృత్తిదారులను ప్రతిఒక్కరిని కోరారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జీవోలను పునరుద్ధరించే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలని కోరారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News