బి.ఆర్.ఎస్ కార్పోరేటర్ పిండి మాధవి బర్త పిండి మహేందర్ ఆక్రమణ నుండి మైనారిటీ నిరుపేద కీ.శే.ఎండి.అంకూస్ అసైన్డ్ పట్టా భూమిని విడిపించి,అంకూస్ బార్య మహబూబ్ బి పేర కొత్త పట్టాదారు పాసు పుస్తకాన్ని ఇప్పించి,న్యాయం చేయాలని ఓపిడిఆర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు,న్యాయవాధి టి.లక్ష్మీదేవి ఆధ్వర్యంలో  శనివారం వరంగల్ సి.పి కార్యాలయంలో వనతి పత్రం
సమర్పించటం జరిగింది.ఈ సందర్భంగా బాదితుని కొడుకు ఉస్మాన్ మీడియాతో మాట్లాడుతూ…మా తండ్రి అంకూస్ కు 1986లో అప్పటి ప్రభుత్వం ఐనవోలు మండలం వెంకటా పురం గ్రామంలో సర్వే నంబర్ 367/16లోని 1ఎకరం (అసైన్డ్)భూమిని ఇచ్చి,పట్టా ఇచ్చింది. అయితే ప్రక్కనే గల వజీర్ బుచ్చయ్య మా స్వంత పట్టా (అసైన్డ్) భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు.తమ భూమని తమకు అప్పగించాలని, వజీర్ బుచ్చయ్య  పేరును వెంటనే రద్దుచేసి,తిరిగి పట్టా కాలంలో మా పేరునే ఎక్కించాలని తహశీల్దార్,పోలీసు స్టేషన్,ఆర్.డి.ఓ,జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికి అధి కారులు మా భూమిని మా పేరున పట్టా చేస్తామని,చేయలదని అన్నారు.దాంతో విసిగి వేసారి,16 ఏప్రిల్ 2018న స్థానిక మండల తహశీల్దార్ కార్యాలయం ముందు మా అమ్మ అంకూస్ భార్య మహాబూబ్ బీ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.దాంతో అప్పటి తహశీల్దార్ మక్బూల్ వి.ఆర్.ఓ ను వెంటబెట్టుకొని భూమి వద్దకు వచ్చి విచారణ జరిపి,ఆ భూమి ఎం.డి అంకూస్ కి చెందినదేననీ తేల్చి, అంకూస్ కే పట్టాను ఇప్పించి,న్యాయం చేస్తామని హామీని ఇచ్చారు.ఈ క్రమంలో కొన్ని నెలల తర్వాత మా తండ్రి అంకూస్ మరణించగా మాయొక్క పేదరికం,అవిద్య,అమాయకత్వంలను ఆసరాజేసుకుని అంకూస్ కి చెందిన సర్వే నెం 367/16 లోని ఎకరం (అసైన్డ్)భూమిని వజీర్ బుచ్చయ్య, స్థానిక అధికార పార్టీ ఎంపిటిసి పిండి.మాదవి బర్త పిండి.మహేందర్ కూడ బలుక్కొని దొంగచాటుగా వజీరు బుచ్చయ్య పేరిట పట్టా చేసుకుని అట్టి భూమిని పిండి మహేందర్ తాను కొనుగోలు చేసినట్టుగా చెప్పుకుంటూ,అధికారపార్టీ అండతో తన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా కబ్జాకు పాల్పడ్డాడని,అమ్ముకోవడానికి-కొనడానికి వీలులేని-సర్వేనెం 367/16లోని.ఒక ఎకరం అసైండ్ భూమిని కబ్జా చేసుకున్నాడని,కబ్జాదారుల నుండి కాపాడి,అట్టి భూమిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కొత్త పట్టా  పుస్తకాన్ని నిజమైన పట్టాదారులమైన మా పేరిట ఇప్పించాలని అధికారులను ఎన్నో సార్లు కోరామన్నారు.ఈ విషయమై అధికారులను,కబ్జాదారులను ప్రశ్నించినందుకు కేసులు పెట్టి వేదించారని అన్నారు.మహేందర్ కబ్జా నుండి విడిపించి నిరుపేదలమైన మాకు(అంకూస్ కొడుకు ఉస్మాన్)పట్టా చేసి తెలంగాణ పట్టాదారు పాసు పుస్తకాన్ని ఇప్పించాలని వరంగల్ సి.పి కార్యాలయంలో  వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు.