• సిద్దిపేట ట్రాక్టర్‌ ర్యాలీలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్

రైతుల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 3 రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే సందర్భంలో రైతులకు 21 నవంబర్‌ 2021న రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రాలో ట్రాక్టర్‌ ర్యాలీ వ్యవసాయ మార్కెట్ నుండి పాత బస్టాండ్ మీదుగా ముస్తాబాద్ చౌరస్తా వరకు తెలంగాణ రైతు సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలు, రైతు సంఘం జండాలు పట్టుకొని పెద్దఎత్తున కేంద్ర ప్రభుత్వానికి నినాదాలు చేశారు. అనంతరం శోభన్ మాట్లాడుతూ.. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడి కి 50% కలిపి మద్దతు ధర నిర్ణయించే చట్టం చేయాలి. దీనికోసం రైతు సంఘాల ప్రతినిధులతో కూడిన కమిటీని నియమించాలి. వ్యవసాయ పంటల ధరల ప్రకారం పెట్టిన పెట్టుబడిలో 80శాతం కూడా రైతులకు రాక రుణగ్రస్తులవుతున్నారు. అందువలన రైతుల రుణాలను రద్దు చేయడానికి పార్లమెంట్‌లో చట్టం చేయాలి. రుణ విమోచన చట్టం చేయాలి. విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా కేంద్ర ప్రభుత్వాన్ని 9 డిసెంబర్‌ 2021న కోరగా కేంద్ర ప్రభుత్వం ‘రైతు సంఘ నాయకులతో చర్చల తరువాతనే బిల్లును ప్రవేశపెడుతానని ‘ హామీ ఇచ్చింది. అందుకు బిన్నంగా బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లు సెలక్ట్‌ కమిటీకి పంపించారు. రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి బిల్లు ఆమోదానికి ప్రయత్నం చేస్తున్నది.
లఖింపూర్‌ఖేరీ జిల్లాలోని తికోనియా గ్రామంలో దేశ హౌంశాఖ మంత్రి అజరు కుమార్‌ మిశ్రా కుట్రతో వాహనాన్ని రైతులపైకి తోలి 4 గురు రైతులను 1 జర్నలిస్టును చంపారు. అతన్ని మంత్రి పదవి నుండి బర్తరఫ్‌ చేసి జైలుకు పంపించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. లఖింపూర్‌ఖేరి మూకుమ్మడి హత్యాఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఉద్యమ సందర్భంగా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. చనిపోయిన వారికి తానిచ్చిన హామీ ప్రకారం ఉద్యమంలో మరణించిన వారందరికీ పరిహారాలు చెల్లించాలి.
ప్రభుత్వం పంటల బీమా ఫథకాన్ని ఫార్సుగా మార్చింది. సమగ్ర చట్టం తయారు చేసి రైతులందరికీ కరువులు, వరదల సందర్భంగా పంటలు నష్టపోయిన వారందరికీ పరిహారాలు చెల్లించాలి. ప్రస్తుత చట్టం బీమా కంపెనీలకు వేల కోట్లు లాభాలు కట్టబెడుతున్నది. రైతులందరి బీమా ప్రిమియంను కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఆ విధంగా చట్టాన్ని మార్చాలి. 60 సంవత్సరాలు దాటిన సన్న, చిన్న, మధ్యతరగతి రైతులకు, వ్యవసాయ కూలీలకు,కౌలు రైతులకు, చేతి వ త్తిదారులకు రూ.5000 పెన్షన్‌ నిర్ణయించి అమలు చేయాలి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతులపై పెడుతున్న అక్రమ కేసులను ఎత్తివేయాలి. వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, చేతి వ త్తులవారు అమరులైన రైతులందరికీ ఎక్స్‌గ్రేషియో చెల్లించాలి. వారి కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. సింగు బోర్డర్‌లో చారిత్రాత్మక పోరాట కేంద్రం వద్ద జ్ఞాపకార్ధం రైతు అమరవీరుల స్థూపాన్ని నిర్మించాలి. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి రోజుకు 600 రూపాయలు కూలి 200 రోజులు పని గ్యారంటీ చేయాలి. అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి కౌలు రైతులకు రుణార్హతకార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చలారపు తిరుపతి రెడ్డి, శెట్టిపల్లి సత్తిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఆముదాల మల్లారెడ్డి, నక్కల యాదవ రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాల స్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్ళబండి శ్రీదర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అరవింద్, దాసరి ప్రశాంత్, సీఐటీయూ జిల్లా కోశాధికారి జి భాస్కర్, సహాయ కార్యదర్శి చొప్పరి రవి కుమార్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బద్దిపడగా కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, కనకచారి, రాజవర్దన్ రెడ్డి, బాల్ రెడ్డి, తడకపల్లి శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

One thought on “కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News