మహిళలు సాకలి ఐలమ్మ పోరాట ప్రతిమ ను ఆదర్శంగా తీసుకోవాలని ఐద్వా హన్మకొండ సౌత్ మండల కార్యదర్శి సాంబరాజు శ్వేతా అన్నారు. ఆదివారం ఐలమ్మ వర్దంతి సందర్భంగా అదాలత్ అమరవీరుల స్థూపం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆనాడు నిరంకుశ రజాకార్లను దేష్ముఖ్ లకు వ్యతిరేఖంగా మొక్కవోని దైర్యం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ వీరవనిత ధైర్య శాలిగా పేరుగాంచిన, నాడు వారు చేసిన పోరాట ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిందని, చాకలిఐలమ్మ ధైర్యం తెగువ చూపుతూ దేశ్ ముఖ్, రజాకార్ల గుండెల్లో భయం పుట్టిందని అన్నారు. నేడు సమాజంలో మహిళలపై దాడులు, హత్యాచారం, హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి వాటిని అరికట్టడానికి మహిళలు గా పోరాటాలు చేయాలన్నారు. చాకలి ఐలమ్మ నే ఆదర్శంగా తీసుకొని మహిళల రక్షణ కోసం, హక్కుల కోసం పోరాడలన్నారు. ఈ కార్యక్రమంలో పడిగే రాణి, చల్లురి రజిత, కన్నం శ్రీలత, నమిలి యశోద, వల్లెపు సరోజ, తదితరులు పాల్గొన్నారు.