మంగళవారం మోతే మండల పరిధిలోని నామవరం గ్రామంలోని ఎలమంచమ్మ జాతరకు సర్పంచ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలకు దాన ధర్మాలు చేయడం మహాభాగ్యం అన్నారు. ఆలయాలు సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలన్నారు. సమాజంలో మానవ సంబంధాలు నైతిక విలువలు ఆలయాల పరిరక్షణతోనే పెంపొందుతాయి అన్నారు. ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని కోరారు.