
యూనియన్ బలోపేతానికి ప్రతి సభ్యుడు కృషి చేయాలి
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తున్న టి డబ్ల్యూ జె హెచ్ 143 యూనియన్ సంఘం బలోపేతానికి సంఘంలోని ప్రతి సభ్యుడు కృషి చేయాలని నియోజకవర్గ అధ్యక్షులు వంగవీటి శ్రీనివాసరావు అన్నారు.
టి డబ్ల్యూ జి హెచ్ 143 యూనియన్ నియోజకవర్గ కార్యదర్శిగా షేక్ మహమ్మద్ ఆలీని నియమించారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ… జర్నలిస్టులకు ఏటువంటి ఇబ్బంది కలిగిన యూనియన్ పరిష్కారం చూపే దిశగా వారికి అండగా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ యూనియన్ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, తద్వారానే సంఘం మరింత బలోపేతం అవుతుందన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యదర్శి మహమ్మద్ అలీ మాట్లాడుతూ… నాపై నమ్మకంతో నాకు అవకాశం కల్పించారని తప్పకుండా యూనియన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్, ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు సలహాలు సూచనలతో ముందుకు కొనసాగుతానని ఈ సందర్భంగా వారు తెలిపారు. నూతనంగా ఎన్నికైన మహమ్మద్ ఆలీని పలువురు జర్నలిస్టులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్ 143 నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మాతంగి సురేష్, ఎలక్ట్రాన్ మీడియా గౌరవ అధ్యక్షులు వెన్నెబోయిన పూర్ణచంద్రరావు, షేక్ నజీర్, తురక హరీష్, పాల్గొన్నారు.