
మహబూబాబాద్ జిల్లా , మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఆశీస్సులతో డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ రామచంద్రనాయక్ గెలుపు కోసం గ్రామ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆరు గ్యారంటీల పాంప్లెట్ ను పూజలు నిర్వహించి ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది,ప్రచారంలో అధికారం బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు, నిరుద్యోగ యువత చదువుకొని ఉద్యోగాలు రాక మనోవేదనకు గురవుతుందన్నారు,వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు డోర్నకల్ నియోజకవర్గంలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, డోర్నకల్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండా మాత్రమేనని ఆశాభావం వ్యక్తం చేశారు,డోర్నకల్ లో గెలిచిది రామచంద్రనాయక్ మాత్రమేనని అన్నారు,ఈ కార్యక్రమంలో గ్రామ యువ నాయకులు బోర హరీష్ యాదవ్, దిడ్డి.సాయికిరణ్, బొర బిక్షం,రాంపల్లి శ్రీను, ధోని పెళ్లి కృష్ణ, కోడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.