
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యమందించాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గళం న్యూస్ భూపాలపల్లి:
శుక్రవారం సాయంత్రం భూపాలపల్లి – కాళేశ్వరం ప్రధాన రహదారి పై మల్లంపల్లి స్టేజి వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని భూపాలపల్లి పోలీసులు 108 వాహనాల ద్వారా జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు. కాగా, విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య చికిత్స చేయాలని డాక్టర్లను ఎమ్మెల్యే కోరారు.