సిపిఎం నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
దేశ ప్రధానమంత్రి మోడీ వరంగల్ పర్యటన సందర్భంగా నిన్న రాత్రి 7-00 గంటలకు సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి రాపర్తి రాజు జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి సుంచూ విజేందర్ పొత్కనూరి కనకాచారి అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన జనగామ పోలీసులు
ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల అక్రమ అరెస్టులు సరైనది కాదని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సిపిఎం జిల్లా కార్యదర్శి ధ్వజమెత్తారు. పాలకులు వారి పరిపాలన కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించే సందర్భంలో ప్రతిపక్షాలను కూడా భాగస్వాములు చేసుకోవాలని అంతేకానీ ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ప్రతిపక్షాలన్నిటిని పోలీసులతో నిర్బంధించి గొంతు నొక్కడం అంటే ఇది పిరికిపంద చర్య అని వారు అన్నారు.
పోలీసులను ఉపయోగించి ప్రజా ఉద్యమాలను ప్రశ్నిచే గొంతులను ఆపలేరని హితవు పలికారు.ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను దేశవ్యాప్తంగా సిపిఎం నికరంగా ఎండగడుతుందని రానున్న రోజులలో బిజెపి వ్యతిరేక శక్తులన్నిటిని కూడగట్టి ఓడించడం ఖాయమని ఓటమి భయం పట్టుకున్న బిజెపి ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతుందని వివరించారు.జిల్లాలోని ప్రజలు ప్రజాస్వామికవాదులు బిజెపి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అర్థం చేసుకొని ప్రజా ఉద్యమాలకు సహకరించాలని ముఖ్యంగా జిల్లాలో జరుగుతున్న భూ ఉద్యమాలను సిపిఎం ముందుకు తీసుకుపోయేదానికి సహాయ సహకారాలు ఉండాలని ప్రజల్ని కోరారు. పోలీసుల నిర్బంధంతో ఉమ్మడి వరంగల్ లో జరుగుతున్న ప్రారంభోత్సవాలు ప్రారంభోత్సవాలు అవి ప్రశ్నించారు.
కాజీపేట లో పెట్టాల్సిన 2000 కోట్ల విలువచేసే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలించకపోయి.500 కోట్ల విలువచేసే ప్రాజెక్టును ప్రారంభిస్తూ తెలంగాణకు వరంగల్ జిల్లాకు ఏదో వోరగా బెట్టినట్లు గొప్పలు చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.విభజన చట్టంలో పొందుపరిచిన గిరిజన యూనివర్సిటీని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఎందుకు ఇవ్వలేదని కేంద్ర ప్రధానమంత్రి మోడీని ప్రశ్నించారు.ఇప్పటికైనా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కృషి చేయాలని బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు