
అన్నదానాన్ని ప్రారంభించిన ఎంపీపీ దొడ్డ
మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు ప్రారంభించారు..
అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసర ప్రాంతాల నుండి ప్రభుత్వ కార్యాలయాల పనులపై వస్తున్నటువంటి ప్రజలకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆహారాన్ని అందిస్తున్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ సాధన కమిటీ సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తున్నానని మీరు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి పేద ప్రజలకు అండగా నిలవాలని,అంతేకాకుండా మహానుభావుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరున పలు రకాల సేవలను విస్తృతం చేసి అంబేద్కర్ ఆశయ సాధనను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు ఆయన సూచించారు...
అన్నదానం అనంతరం భోజనాలకు వచ్చిన ప్రజలతో కలిసి వారితో మమేకమై భోజనాన్ని స్వీకరించి, వారితో కలిసి మెలిసి పేద,ధనిక కులమత బేధాలు లేకుండా అందరితో కలిసి భోజనం చేసి మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు, అదేవిధంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గృహలక్ష్మి పథకానికి అర్హులైన లబ్ధిదారులు సత్వరమే దరఖాస్తులు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం నందు సమర్పించాలని ప్రజలకు ఆయన ఈ సందర్భంగా సూచించారు..
అనంతరం కమిటీ అధ్యక్షులు మోదుగు ఆశీర్వాదం మాట్లాడుతూ మండల స్థాయిలో వివిధ కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉంటూ మేము పిలవగానే మాఆహ్వానాన్ని మన్నించి తన విలువైన సమయాన్ని హెచ్చించి అన్నదాన కార్యక్రమానికి హాజరై ప్రారంభించి మాతోనే కలిసి భోజనం చేసి మమ్మల్ని ఉత్సాహపరిచిన ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు కు మా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వారిచ్చిన చూసిన మేరకు మాకు సాధ్యమైనంత మేర అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మేము ఎప్పుడు వెనకాడమని ఈ సందర్భంగా ఆశీర్వాదం తెలియజేశారు...
ఈ కార్యక్రమంలో ఆయన వెంట గోపాలపేట సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు,తెలగవరం గ్రామ విడిసి చైర్మన్ మువ్వ మురళీధర్ రావు,పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ అశోక్, అడ్వకేట్ ఇనపనూరి విశ్వేశ్వరరావు,అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ సాధన కమిటీ అధ్యక్షులు మోదుగు ఆశీర్వాదం,ఉపాధ్యక్షులు కాంపెల్లి రాము,ప్రధాన కార్యదర్శి మేడి బసవయ్య,గౌరవ అధ్యక్షులు అద్దంకి ప్రసాదరావు,కమిటీ సభ్యులు గొల్లమందల సురేష్ దేవా,వెంకటేశ్వరరావు,నరేష్,నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు