
డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండల శక్తి కేంద్రంలో కార్నర్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా పాలక్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పాలక్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మాట్లాడుతూదేశ ప్రజల ఆత్మ బంధువు, మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజల కోసం రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశానికి మచ్చలేని, అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో మహిళల కోసం ఉచిత గ్యాస్, మరుగు దొడ్లు, బాలింత కిట్లు, రైతుల కోసం ఏటా రూ. 6 వేల నిధి. ఎరువుల సబ్సిడీ, ప్రతి ఏటా మద్దతు ధర పెంపు లాంటి కార్యక్రమాలు, ఇల్లు లేని ప్రతి పేదకు ఇల్లు నిర్మించి ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ లాంటి ఎన్నో పథకాలను శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అందిస్తోంది. గ్రామ పంచాయితీలు, స్థానిక సంస్థల్లో కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో లైట్లు, సీసీ రోడ్లు, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు లాంటి అభివృద్ధి పనులు కేంద్రం నిధుల వల్లనే ఏర్పాటు అవుతున్న విషయం అందరికి తెలిసినదే. కరోనా విపత్తు సమయంలో పేదలెవరు ఆకలితో అలమటించొద్దని ముడేళ్లుగా పేదలకు ఉచితంగా నెలకు తలాకు 5 కిలోల బియ్యం అందిస్తున్న ఘనత శ్రీ నరేంద్ర మోదీది.గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించింది. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ ఓటు వేసినందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల అభివృద్ధి. సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది నిధులు కేటాయిస్తోంది. ఒకప్పుడు ఎరువుల బస్తాల కోసం రైతులు లైన్లో చెప్పులు, పాస్ బుక్కులు పెట్టే ఎదురు చూసేవారు. రైతులకు ఎరువుల బాధలు తీర్చేందుకు ఎప్పుడో మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.6,300 కోట్లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పునః ప్రారంభించారు. ఇక్కడి ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు రామగుండం ఎన్టీపీసీ ద్వారా రూ.8,500 కోట్లతో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మంజూరు చేశారు. ప్రజా వైద్యం కోసం బీబీనగర్ ఏయిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించారు. పల్లె నుంచి పట్నానికి, అక్కడి నుండి రాష్ట్రాలకు అనుసంధానం చేసే లింక్ రోడ్లను మంజూరు చేసిన ఘనత బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానిదే. సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలు ప్రారంభం కావడంతో వేలాది మంది ప్రయాణీకులు తక్కువ సమయంలో తమ గమ్యానికి చేరుకునే అవకాశం లభించింది.6359 119 119నెంబరుకు మిక్స్డ్ కాల్ ఇవ్వండి…. బిజెపి చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపండి. అదేవిధంగా ఈరోజు మరిపెడ మండల మున్సిపాలిటీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గెస్ట్ హౌస్ సెంటర్లో బిజెపి జెండాను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచంద్రరావు ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీ రమేష్ రాథోడ్ అసెంబ్లీ ప్రబారి ఈవి రమేష్, జిల్లా అధ్యక్షులు రామచంద్ర రావు , జిల్లా సెక్రెటరీ చీకటి మహేష్ , అసెంబ్లీ కన్వీనర్ తాడ పూర్ణచందర్ రెడ్డి , డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మణ్ నాయక్ మరిపెడ మండల టౌన్ అధ్యక్షులు భూక్యా లింగం మరిపెడ మండలం అధ్యక్షులు బింగి రమేష్ యాదవ్, ఎస్సీ మోర్చా సూర్యపేట జిల్లా ఇన్చార్జి ధర్మారపు వెంకన్న, మహబూబాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు బానోతు కృష్ణ, మరిపెడ మండల ప్రధాన కార్యదర్శి ఆకుల హరికృష్ణ, సురేష్,శక్తి కేంద్ర ఇంచార్జి నాగరాజు, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ భూక్యా అనిల్ నాయక్ ,జగన్ నాయక్, జిల్లా నాయకులు జనార్ధన్, మునవర్ రమేష్, బావ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.