
సమాచార హక్కు చట్టం-2005 ఏర్పడి 18 సంవత్సరాలు కావొస్తున్న నేటికి ఈ చట్టం పై ప్రజలకు అవగాహన లేకపోవడం ప్రభుత్వ కార్యాలయాలలో జరిగే పనులలో పారదర్శకత జవాబుదారీతనం పట్ల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ప్రభుత్వ పనులకు పెడుతున్న ఖర్చులు ప్రతి పైసా ని, ఫైల్స్ ని తెలుసుకునే హక్కు ప్రతి పౌరునికి ఉన్నది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజలకున్న పరిష్కారం కానీ సమస్యలను ఈ చట్టం ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. సమాచార హక్కు చట్టం పై అవగాహనా లేని ప్రజలకు ప్రభుత్వాలు ఈ చట్టం పై ప్రచారం కల్పించడం లో విఫలం చెందాయి.ఈ చట్టాన్ని ప్రజలకి అందుబాటులో ఉండడానికి తగు అధికార యంత్రాంగంను ఏర్పాటు చేయడంలో కూడా ఘోర విఫలం చెందాయి. ప్రజలు ఈ చట్టం పై దరఖాస్తులు చేసుకోగా రాష్ట్ర సమాచార కమిషన్లలో కమిషనర్ లు లేక వేల సంఖ్యలో పరిష్కారం కాకుండా ఉన్న పెండింగ్ కేసులు ఉన్నాయి. ప్రజలు ఇప్పటికి ఈ చట్టంపై సలహాల కోసం, అవగాహన కోసం తనని సంప్రదిస్తున్నారని అందరికోసం సెప్టెంబర్ 04 నా ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ తన పుట్టినరోజు సందర్భంగా ఈ చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఆర్టీఐసతీష్.కామ్ అనే వెబ్సైట్ ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఆర్టీఐ చట్టం పై సలహాలు సూచనల ద్వారా ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని సంకల్పించారు.. దీనిని ప్రతి ఒక్కరు ఆ వెబ్సైట్ ద్వారా సమాచార హక్కు చట్టం కి సంబంధించిన అంశాలను తెలుసుకోవాల్సినదిగా వారు కోరారు.