జఫర్ఘడ్ మేజర్ గ్రామ పంచాయితీ కార్మికుల సమ్మె వలన ఎక్కడికక్కడ చెత్త చేదారంతో నిండి వర్ష కాలం కావడంతో కంపు కొడుతున్నదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.ఈ సందర్బంగా స్థానికుడైన కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ యూత్ వైస్ ప్రెసిడెంట్ తాటికాయల రాజేందర్ మాట్టాడుతూ..వడ్డెగూడెంలో రెండు రోజులుగా మంచి నీళ్లు కూడ రావడం లేదని సర్పంచ్,మరియు ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.నేను గెలిచాక నా సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పి గెలిచాక సొంత నిధులు కాదు కదా ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో నైన గ్రామాన్ని అభివృద్ధి చేయలేదని సర్పంచ్ ను విమర్శించారు. గ్రామ పంచాయితీ సిబ్బంది సమ్మె చేస్తున్నప్పుడైన కనీసం ఊర్లో ఉన్న చెత్త చెదారాన్ని కూడా తీయించలేని పరిస్థితీలో ఉన్నారని విమర్శించారు