కాంగ్రెస్ తోనే యువతకు చేయూత
కాంగ్రెస్ తోనే యువతకు విద్యా, ఉద్యోగ భద్రత అభిస్తుందని, ఆరు గ్యారెంటీల ద్వారా ప్రతి కుటుంబానికి ఫలాలు అందుతాయని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ శనివారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని సేవా నగర్ లో యూత్ నాయకులతో కలిసి ఇంటింటి వెళ్లి ఆరు గ్యారెటీ పథకాల కరపత్రాన్ని అందించి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డోర్నక నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాంచంద్రునాయక్ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంగా యూత్ నాయకులు లూనావత్ చందు నాయక్, నాగేష్, నవీన్, వెంకన్న, ఉప్పలయ్య, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.