
-రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్ హెచ్చరిక.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు లోపు గిరిజన బంధును అమలు చేస్తూ జీ ఓ జారీచేయాలని చేయాలని లేకపోతే ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతామని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గిరిజనులకు గిరిజన బంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తెలంగాణ గిరిజన సంఘం హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హన్మకొండ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆర్.శ్రీరాం నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఇందులో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బల్లకొండ శ్రీకాంత్, వాంకుడోత్ వీరన్న, నాయకులు,జగన్,తిరుపతి,రమేష్,సిద్దు,నరసింహ,రమ,సుమలత,సారయ్య,స్వరూప,లాలూ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ గిరిజనులకు గిరిజన బందు ను అమలు చేస్తామని గత ఏడాది సెప్టెంబర్ 17న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించి ఎనిమిది నెలలు కావస్తున్నా అమలుకు నోచుకోకపోవడం దుర్మార్గమని ఆరోపించారు. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో గిరిజన బందు ను ఎప్పుడు అమలుచేస్తారో ప్రభుత్వం స్పష్టత నివ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన బందు ను అమలు చేయకుండా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో గిరిజన ఉత్సవాలను నిర్వహించడం గిరిజనులను మోసం చేయడమేనని విమర్శించారు.గిరిజన మంత్రి,ఎంపీ, ఎం ఎల్ ఏ లకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పై వత్తిడి చేసి దశాబ్ది ఉత్సవాల ముగింపు లోపు గిరిజన బందు అమలుకు జీ ఓ ను జారిచేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 15 లక్షల గిరిజన కుటుంబాల్లో 10 లక్షల కుటుంబాలకు పైగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని అన్నారు.భూమిలేని గిరిజనులకు మాత్రమే గిరిజన బందు ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనను వెనక్కుతీసుకుని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్ది ఉత్సవాలు అమలు చేస్తూ జీవో జారీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గిరిజన బందు సాధన కోసం గిరిజనులు,విద్యార్థి,ఉద్యోగ సంఘాలు,మేధావులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.