ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటు చేస్తే గోదావరి జలాలు కలుషితమై ప్రజలు ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.శుక్రవారం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని పాశిగామ, స్తంభంపల్లిలో ఇథనాల్ కంపెనీ వద్దంటూ గత మూడు నెలలుగా ఆందోళన చేపట్టిన గ్రామస్తులకు ఆయన సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల గాలి,నీరు,భూమి కలుషితమై ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని, ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తే వేలాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్వాసితుల కన్నీళ్లు గోదావరిలో వరదలై పారుతున్నాయని అన్నారు.110 ఎకరాల భూమిని రైతుల నుండి ప్రభుత్వం బలవంతంగా గుంజుకొని రూ.700 కోట్లతో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు వల్ల రైతులు తీరని అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. భవిష్యత్తులో ఈ ఫ్యాక్టరీల వల్ల తాగునీరంతా కలుషితమై, ఆహరధాన్యాలు,నీటి కొరత ఏర్పడి ప్రజలకు తిండి దొరక్క దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటారన్నారు. ఫ్యాక్టరీని నిర్మిస్తే చుట్టు ప్రక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు.

పరిశ్రమల పేరుతో తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేదల భూములను బలవంతంగా లాక్కుంటున్న ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్ భూముల్లో పరిశ్రమలు ఎందుకు ఏర్పాటు చేయరని ప్రశ్నించారు?దివిటిపల్లిలో 6000 ఎకరాల భూమిని ఆంధ్ర కంపెనీకి అప్పగించడంపై తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ ఏర్పడింది ఇందుకేనా అని ప్రశ్నించారు.ఇథనాల్ కంపెనీ ఏర్పడితే ప్రజలు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.భూగర్భ జలాలు కలుషితమై,సాగుకు యోగమయ్యే భూములు కలుషితమవుతాయాని అన్నారు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న గ్రామాల రైతులు పండించిన వరి ధాన్యన్ని కొనుగోలు చేయకుండా బయోబ్రాంతులకు గురి చేయడం అన్యాయమన్నారు.రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేస్తానన్న కేసీఆర్ ప్రభుత్వం కంపెనీని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు పండించిన వరి ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు.

గతంలో వడ్డెర సామాజిక వర్గ నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించారని,యాదవ సంఘానికి భూములు కేటాయిస్తామని,విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని,100 పడకల ఆసుపత్రి, గురుకుల పాఠశాల నిర్మిస్తామని మంత్రి మంత్రి ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే దొడ్డి దారిన ఫ్యాక్టరీని నిర్మించడానికి స్వలాభం కోసమే 10 గ్రామాల ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి క్రిబ్కో క్యాంపెనీతో చేతులు కలిపారని ఆరోపించారు.గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపులో ఈ గ్రామాల ప్రజలే భూములు కొల్పోయారని, ఈ ఫ్యాక్టరీ వల్ల వారికి నిలువ నీడలేని పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. కాళేశ్వరం కాలువ తవ్వకాల బ్లాస్టింగ్ వల్ల ఇండ్లు నేర్రెలుబారుతున్న రామక్కపేట  ఎస్సీ కాలనీలో పర్యటించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News