
పేద ప్రజల గుండె చప్పుడు
మాట తప్పని మడమ తిప్పని మహానేత తెలుగు ప్రజల జీవితాల పై చెక్కు చెదరని సంతకం “వైఎస్సార్”!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,కాంగ్రెస్ నేత వైఎస్సార్ 14 వ వర్థంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు. మునగాల మండల కేంద్రంలో గాంధీ పార్క్ లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ కాంగ్రెస్ పార్టీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి , కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్ రైతు సంఘం నాయకులు కాసర్ల వెంకట్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు పసుపులేటి గోపి సీనియర్ నాయకులు చింతకాయల శ్రీనివాస్ ,తురక వెంకన్నయూత్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు సంగిశెట్టి నారాయణ , తంగెళ్ల రాము , సుంకరి నాగేశ్వరరావు అలియాస్ స్వామి, సతీషు , అజిత్ ప్రదీప్ ,కమతం గురుస్వామి మామిడి మంజు సందీప్ తదితరులు పాల్గొన్నారు.