కుర్నవల్లి ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే సండ్రకు ఘన స్వాగతం

హరిజనవాడకు స్మశాన వాటిక స్థలం అప్పగింత

మేళ తాళాలతో యస్. సి. కాలనీ ప్రజలు ఘన స్వాగతం పలికారు

గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సండ్ర కు సోదరి సోదరమణులు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు

తల్లాడ : తల్లాడ మండలం కుర్నావల్లి లో ఈరోజు జరిగిన కార్యక్రమం లో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో అభివృద్ధి లక్ష్యంగా పని చేసి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేలా కృషి చేశానని, ముందుగా ఎస్సీ కాలనీ ప్రజలు ఎమ్మెల్యే సండ్ర కు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు పూలదండలు శాలువాలతో ఘనంగా సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కురవల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 25 లక్షలు మంజూరు చేసామన్నారు కమ్యూనిటీ హాల్ ను పెళ్లి మండపాలుగా ఉపయోగించుకొని అoదుకు అని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు కుర్నవల్లి నుండి ఉమ్మడి దేవరపల్లి రోడ్డుకు ఏడు కోట్లు కుర్నవల్లి నుండి పుణ్యపురం రోడ్డుకు బ్రిడ్జి తో పాటు బీటీ రోడ్డు నిర్మాణానికి మూడు కోట్ల రూపాయలను మంజూరు చేసామని తెలిపారు గ్రామంలో అవసరమైనన్ని సీసీ రోడ్డు నిర్మించి కుర్నవల్లి గ్రామాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృచేశామన్నారు రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించి లబ్ధిదారులకు న్యాయం చేసామన్నారు త్వరలో గృహ లక్ష్మీ పథకం ద్వారా నియోజకవర్గ ప్రజలకు 3000 ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ఎస్సీ కాలనీ ప్రజలు కోరిక మేరకు స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించి అందజేశామన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కెసిఆర్ ను తనను ఆశీర్వదించాలన్నారుకార్యక్రమంలో DCMS చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ. శ్రీనివాసరావు, బి. ఆర్.యస్ పార్టీ మండల అధ్యక్షులు రెడ్డం. వీరమోహన్ రెడ్డి, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి. భద్ర రాజు, రైతు బంధు మండల అధ్యక్షులు దుగ్గిదేవర. వెంకటలాల్, సర్పంచ్ అయిలురి.లక్ష్మి,కుర్నవల్లి సొసైటీ చైర్మన్ ఆయిలూరి ప్రదీప్ రెడ్డి, ఎంపీటీసీ అన్నెం. కళావతి,మాజీ వైస్ ఎంపీపీ అన్నెం. కోటి రెడ్డి,జోనల్ చైర్మన్స్ దిరిసాల.దాసురావు, బద్ధం. కోటిరెడ్డి, సర్పంచ్ జొన్నలగడ్డ. కిరణ్ బాబు, బి. ఆర్. యస్ నాయకులు జి. వి. ఆర్, వరపర్ల. ఉదయ్,ఉప్పెర్ల రామారావు, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News