
జనగామ లో సిపిఎం జిల్లా కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు
ఈ69న్యూస్ జనగామ
జనగామ జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీమ్రావ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం నిర్వహించిన సభలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బూడిది గోపి మాట్లాడారు.డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కలలు కన్న సమాజం–సమానత్వం,న్యాయం,మానవతా విలువలు కలిగిన సమాజ నిర్మాణం కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేశారు.ఈ రోజు మన సమాజంలో రాజ్యాంగ విలువలు,మతసామరస్య,ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్న ఈ సందర్భంలో అంబేద్కర్ ఆశయాలను నిలుపుకోవడం అత్యవసరం”అన్నారు.అంబేద్కర్ చూపిన మార్గం,ఆయన పోరాటం ప్రతి ఒక్కరికి ప్రేరణనిచ్చే విధంగా ఉందని గోపి చెప్పారు.కులహీన సమాజం,విద్య,స్వయం సమర్థత ద్వారా దళితులకు సాధికారత అందించాలన్న అంబేద్కర్ అభిప్రాయాలను గుర్తుచేశారు.ఆయన రాజ్యాంగం రచించిన విధానం ఈ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించడానికే అని చెప్పారు.