రామ సురేందర్ నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల నివాళులు
ఈ69 న్యూస్ వరంగల్
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలోని జక్కలోద్ది గ్రామంలోని రామ సురేందర్ నగర్లో ఉన్న అంబేద్కర్ జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి సోమవారం పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కలకోటి శ్యామ్,గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గజ్జ చందు మాట్లాడుతూ..“డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రపంచానికి గర్వకారణమైన మేధావి,అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని అర్పించిన త్యాగశీలి.ఆయన అందించిన రాజ్యాంగం ప్రపంచానికి మార్గదర్శకం,”అని అన్నారు.అంతేగాక,ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నదని,దేశ ప్రజాస్వామ్యానికి అది ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.మనుధర్మ సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తూ,ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.దళిత,బీసీ,మైనార్టీ వర్గాలను విభజించే రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించారు.“ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే నూటికి 90 శాతం అణగారిన వర్గాలు ఐక్యంగా ముందుకు రావాలి”అని పిలుపునిచ్చారు.రాహుల్ గాంధీ,సోనియా గాంధీ,తెలంగాణ సీఎం ఏనుముల రేవంత్ రెడ్డి,కొండా దంపతుల నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న పోరాటాలను ప్రజలు సమర్థించాలని ఆకాంక్షించారు.కార్యక్రమ ముగింపులో గ్రామ ప్రజలకు పండ్ల పంపిణీ నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో మైదం పెద్ద వినోద్,దుప్పటి రమ్య,తూర్పటి కవిత,సట్ల రజిత,సుజాత,పూర్ణచందర్,ఇమ్మడి శ్రీనివాస్,శంకర్,బొంత సంపత్,చేగొండ రాజు,గన్నారపు రాజేష్,పుట్ట అనిల్,రబ్బానీ,అబ్రాన్,బిర్రు మహేందర్,పూల రాకేష్,ఎండీ జమీల్,మొగుళ్ళ సునీల్,కొండల్,చింటు,ఎస్.విజయ్ తదితరులు పాల్గొన్నారు.