
11 వ డివిజన్ హాత్ సే హాత్ జోడో యాత్రలో నాయిని
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఈ రోజు హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 వ డివిజన్లో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని పాపయ్య పేట చమన్ మస్జిద్ స్కూల్ రోడ్డు వద్ద కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ చేసి పాద యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల చార్జ్ షీట్ ను, మరియు రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల రూపంలో చేర వేయడం జరిగింది.
అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..
2014 ఎన్నికల సందర్భంగా మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదు.
డిమోనిటైజేషన్ అంటూ పెద్ద నోట్ల రద్దు ను చేసి నల్ల ధనాన్ని రూపు మాపి ఆ డబ్బు పేద ప్రజల ఖాతాలో జమచేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ పేద ప్రజల ఖాతాలో నగదు జమచేస్తానని చెప్పిన మోడీ మాటలు ఏమయినాయి.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ చేస్తూ అదాని అంబానీలకు కట్టబడుతున్నది ఈ బిజెపి.
గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్ట్ లు చారిత్రిక కట్టడాలు, ప్రభుత్వ రంగ సంస్థలను, విశ్వ విద్యాలయాలు ఏర్పాటు చేస్తే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమ్మే స్తున్నాయి, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు.
రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తెచ్చి రైతులును మోసం చేసి, రైతు ఆత్మ హత్యలకు కారణమయింది బిజెపి పార్టీ. మోడీ పాలనలో దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి.
యూపీఏ 2 ప్రభుత్వం లో నిత్యవసర వస్తువులు పేద ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేశారు..
యూపీఏ దిగిపోయే సమయంలో గ్యాస్ 414, డీజిల్ 55, పెట్రోల్ 71 రూపాయలకు అందుబాటులో ఉంది.
ఇప్పుడు చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ప్రతి రోజు పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ సామాన్య మానవును నడ్డి విరిచిన ఘనత బిజేపి పార్టీ
టి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకీ వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు నిర్వీర్యం చేసింది,
అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మభ్య పెట్టింది టి.ఆర్.ఎస్. పార్టీ.
తెలంగాణా వస్తే ప్రజల బతుకులు మారుతాయని, బాధలు పోతాయని నమ్మిన ప్రజలకు కే.సి.ఆర్.చెంది ఏమి లేదు.
పోరాడి సాధించుకున్న తెలంగాణాలో పేద ప్రజలకు ఒరిగింది ఏమి లేదు నిరుద్యోగుల చావులు, రైతుల ఆత్మ హత్యలు, సామాన్య ప్రజల నెత్తిపై అప్పులు తప్ప.
టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా చేసిందని గొప్పలు చెప్పుకున్న ఈ ప్రభుత్వం మరి ధనిక రాష్ట్రంగా ఉన్న ఈ తెలంగాణలో మొన్న డెవలప్ మెంట్ నేడు ACD చార్జీల పేరిట వసూలు చేస్తూ ప్రజలపై భారమెందుకు మోపుతున్నారు ?
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంత వరకు DSC లేదు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలలు లేవు.
గడిచిన 6ఎండ్లలో ముఖ్యమంత్రి కెసిఆర్,మున్సిపల్, ఐటి మంత్రి కేటీఆర్ లు వరంగల్ పర్యటన సందర్భాలలో అనేక ఉచిత హామీలిచ్చరు వాటికే మొక్షంలేదు నగరంలో అనేక చోట్ల వేసిన శిలాఫలకాలై ఇప్పటికీ అసంపూర్తిగా దర్శనం ఇస్తున్నాయి.
కేంద్రం నుండి సంవత్సరం నికి 300 కోట్లు నిధులు వస్తాయి, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించి వరంగల్ నగరాన్నిబ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామన్నాకెసిఆర్ మాటలు నీటి మూటలుగానే ఉన్నాయిని.
3 ప్రాజెక్ట్ ల క్రింద సెలెక్ట్ అయిన వరంగల్ నగరం ఇంకా ఎందుకు అభివృద్ధి చెంద లేదు.
నిధులు ఉన్న కూడా నిధులను వినియోగించుకొని దద్దమ్మలు ఈ టిఆర్ఎస్ నాయకులు.
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్.. అక్కడ మోడీ ఇక్కడ కేడి.. ఇద్దరు ప్రజలను మోసం చేస్తున్నారు..
మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల హామీలను విస్మరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించే సమయం ఆసన్నమయిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పో రేటర్ తోట వెంకటేశ్వర్లు, డివిజన్ అద్యక్షుడు గన్నారపు సంగీత్ కుమార్, కాంటెస్ట్ కాండిడేట్ రాహత్ పర్వీన్, సీనియర్ నాయకుడు వై భాస్కర్, మహమ్మద్ సమాద్, మొహమ్మద్ అజ్గర్,మాడిశెట్టి రాజ్ కుమార్, మహమ్మద్ జామీరుద్దిన్, జి. శివ, దోర్తి, గోల్కొండ సాంబయ్య. మాలతీ, నిర్మల, మేరీ, క్రాంతి, వీరమని, బి. వెంకటేశ్వర్లు, జి. సాయి, వై. జుబేదా, తస్లీం, ప్రమోద్, ప్రనయ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, గ్రేటర్ వరంగల్ మైనారిటీ సెల్ చైర్మన్ మిర్జా అజీజుల్లా బేగ్, జిల్లా NSUI అధ్యక్షుడు పల్లకొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు.