
తెలంగాణ ప్రజలు సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలి- గుండు శ్రీను
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నాయకురాలు సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీను ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాల తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆశించిన ప్రజలకు విద్యార్థులకు నిరుద్యోగులకు నిరాశ మిగిలిందని మిగులు ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి త్యాగాల తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా మార్చిన ఘనత కేసిఆర్ కి దక్కిందన్నారు.దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్ని వర్గాల ప్రజలకు కులాల మతాల వారిని అభివృద్ధి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ దేని అన్నారు. ఈనెల 17వ తేదీన హైదరాబాద్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ బహిరంగ సభకు వేలాదిగా స్వచ్ఛందంగా తరలిరావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వేపూరి సుధీర్, గ్రామ శాఖ అధ్యక్షులు నర్సిరెడ్డి, సోమయ్య, గోవర్ధన్, నాగరాజు,గోపి,లింగరాజు, హుస్సేన్, కిట్టు, గోపి,విజయ్ తదితరులు ఉన్నారు.