ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ హోమియో ఫిజీషియన్ డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ ను తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నందుకు అలాగే ఇటీవల “ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ ” తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. అలాగే వైద్యరంగంలో మరిన్ని విశిష్ట సేవలను ప్రజలకు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ డాక్టర్ శ్రీధర్ మొదటి నుంచి కష్టపడి ఉన్నత స్థితికి ఎదిగాడని ఇలాగే వైద్య వృత్తిలో మంచి సేవలందించి సమాజానికి మేలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విజయ్, సంపత్ , మధు , విక్రమ్ రెడ్డి కోచ్ రమేష్, కిరణ్, రాజు, కృష్ణ, రాజిరెడ్డి, శశి, మహేందర్ రెడ్డి, కట్ల శ్రీను, పూజారి విజయ్ తదితరులు పాల్గొన్నారు.