ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు అధిక నిధులు ఇవ్వాలి
Hyderabadప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి, అభివృద్ధి చేసి ప్రభుత్వ విద్యారంగాని పరిరక్షించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు అన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ సిటి కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యాసంస్థలలో సమస్యలను తెలుసుకునేందుకు విద్యార్ధి మహా పాదయాత్రను ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా అధ్యక్షతన జరిగిన సభలో నాగరాజు మాట్లడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెండింగ్ స్కాలర్ షిప్స్ రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయలేదని గత 4 యేండ్లు నుండి ఈ సమస్యలు పరిష్కారం చేయకపోవడం మూలంగా ఎంతోమంది విద్యార్థులు తీవ్రంగా చదువులు నష్టపోతున్నారని అన్నారు. గురుకులాలు, కెజిబివిలు,కళాశాలలో పాత భవనాల్లో నడుస్తున్నాయని ఇరుకు గదుల్లో చదువులు కోనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటే ఒక్క కళాశాలలో కూడ పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ పంపీణి చేయలేదని,యూనిఫామ్ ఇవ్వలేదని అన్నారు. 2018లో మంత్రి హారీష్ రావు నేతృత్వంలో ఇంటర్ విద్యార్ధులకు భోజనం అందించేందుకు కమిటీ వేశారని,అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యాహ్నం భోజనంపై ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదని ఆయన అన్నారు. తక్షణమే ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. హస్టల్స్, గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని వాటిలో సరైన వసతులు లేవని అన్నారు.సరిపడా మూత్రశాలలు లేక, త్రాగునీరు లేక, పడుకునేందుకు డార్మెటరీ కూడా సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న కనీసం హెల్త్ చెకప్ కూడా నిర్వహించడం లేదని,విద్యార్ధులకు కళ్ళ ఇన్సపెక్షన్ వచ్చిన డాక్టర్లు వెళ్ళలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. విద్యారంగంలో ఖాళీలలను కూడా భర్తీ చేయడం లేదని అన్నారు. హైదరాబాద్ లాంటి మహా నగరంలో హస్టల్స్ అవసరం ఎక్కువ ఉన్నా వాటిని ఇవ్వడం లేదు, ఉన్న బిల్డింగ్స్ లో సమస్యలు తారాస్థాయికి చేరాయన్నారు. తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కారం చేసి నిధులను ఇచ్చి ప్రభుత్వ విద్యారంగాని పరిరక్షించాలని కోరారు.
-హైదరాబాద్ జిల్లా కార్యదర్శి యాత్ర రథసారథి కె.అశోక్ రెడ్డి మాట్లడుతూ హైదరాబాద్ ఉమెన్ యూనివర్శీటీకి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, యూనివర్శీటీ ప్రకటించిన నిధులు ఇవ్వలేదన్నారు. తక్షణమే 100 కోట్లు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్డినరీ బస్సు పాసులను కూడా మెట్రో బస్సులలో అనుమతించాలని కోరారు. ఈ పాదయాత్ర నాలుగు రోజుల పాటు పలు విద్యాసంస్థలను సందర్శించనుంది. ఈ పాదయాత్ర కు సంఘీభావంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.డి.జావేద్ పాల్గోని మాట్లడారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో యాత్రబృందం నాయకులు జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, నాయకులు పవిత్ర, నాగేందర్, స్టాలిన్, సునీల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.