ప్రవేట్ విద్యాసంస్థలతో కుమ్మకైన MEO :- రామావత్ రమేష్ నాయక్
Nalgondaఈరోజు దేవరకొండ లోని స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు రామావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గం లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను పట్టించుకునే నాధుడే లేడు రెగ్యులర్ గా టీచర్స్ స్కూల్ కి వస్తున్నారా లేదా అని పర్యవేక్షించాల్సినటువంటి MEO గారు పట్టించుకోవడం లేదు MEO ఆపీస్ లో ఒక్కో సంతాకానికి ఒక్కో రేట్ తీసుకుంటూ విద్య వ్యవస్థ దిగజారుస్తున్నరూ ప్రైవేట్ విద్యా సంస్థలు వారు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న, క్వాలిఫికేషన్ లేని టీచర్లు పెట్టుకొని అడ్డగోలు ఫీజులు పెంచుతూ పేద తల్లిదండ్రుల ముక్కు పిండి వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలను నియంత్రించవలసిన MEO గారు వారితో కుమ్మకై వారు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి ఇప్పటి వరకు ఒక విద్యాసంస్థను విజిట్ చేయకుండా ప్రైవేట్ విద్యా సంస్థలు పిల్లల తల్లిదండ్రులను మా స్కూల్లోనే పుస్తకాలు కొనాలి మా స్కూల్లోనే బట్టలు కొనాలని వారి పై ఒత్తిడి చేసి ఒక్కొక్క పిల్లాడి తల్లిదండ్రుల దగ్గర ఒకటో తరగతి పిల్లాడి పుస్తకాలకు 5000 మరియు బట్టలకు 5000 అని ఇవి కాకుండా బయట నుంచి మరొక వెయ్యి రూపాయల నోటు పుస్తకాలు తీసుకురావాలని వారి జేబులను కొల్లగొడుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల మీద ఇంతవరకు స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ ఏ ఒక్క రోజు విజిట్ చేయడం గానీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని చూడడం గాని క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టీచర్లను పెట్టారా లేదా అని స్కూల్ ని (విజిట్) పర్యవేక్షించకుండా వారు ఇచ్చేటువంటి మామూళ్లకు ఆశపడి పట్టించుకోకుండా ఉన్నటువంటి ఎంఈఓ గారి పైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను మరియు జిల్లా కలెక్టర్, డిఇఓ గార్లను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు
ఈ కార్యక్రమంలో మహిళా కన్వీనర్ కొండ లలిత గారు పట్టణ అధ్యక్షుడు అట్టికేశ్వరం దయాకర్ స్వేరో స్టూడెంట్ యూనియన్ అధ్యక్షులు ఇంజమూరి శేఖర్ Bit-Cell కన్వీనర్ శ్రీరామదాసు తరుణ్ చారి జంతుక అనిల్, మతంగి జాన్, అంకురి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు