
నిత్యం సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ప్రభుత్వానికి,ప్రజలకు చేరవెస్తున్నప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు వారి కుటుంబాలకు ఎంతో కొంత సేవ చేయాలనే సదుద్దేశంతో వర్మ చెస్ట్ హాస్పి టల్లో ఉచిత ఊపిరితిత్తుల వైద్య శిబిరాన్ని వరంగల్ గవర్నమెంట్ ఐటీఐ ఎదురుగా,ములుగురొడ్డులో గల వర్మ చెస్ట్ హాస్పిటల్లో ఉచిత ఊపిరితిత్తుల వైద్య శిబి రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డా. శ్రీనివాస్ వర్మ తెలిపా రు. ఈ సందర్భంగా డా.శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రతిరోజూ ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు అనినిత్యం వార్తలను సేకరించి, అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు చెరవెస్తున్న మీడియా ప్రతినిధులకు వారి కుటుంబాలకు నా వంతుగా సేవ చేయాలనే సదుద్దేశంతో ఈ ఉచిత ఊపిరితిత్తుల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డా.శ్రీనివాస్ వర్మ అన్నారు
ఆదివారం ఉదయం 10 గంటల నుండి,మధ్యాహ్నం 2 గంటల వరకు ఆస్తమా, సిఓపిడి,క్షయవ్యాధి బ్రాంకైటి స్,దగ్గు, ఊపిరితిత్తుల్లో నీళ్ళు/ చీము చేరడం ఛాతీ లో గాలి చేరడం, (న్యూమోతోరాక్సు) ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్,న్యుమోనియాఆయాసం,పిల్లికూతలు, ఛాతీ నొప్పి, తదితర వ్యాధులు ఉన్నవారికి ఉచితం గా చూస్తామ ని,ఉచితంగా మందులు కూడా ఏర్పా టు చేస్తామని,అలాగే కంప్యూటర్ ద్వారా ఊపిరి తిత్తుల సామర్థ్య పరీక్షలు కూడా ఉచితంగా చేస్తామని డా.శ్రీనివాస్ వర్మ అన్నారు.ఈ అవకాశాన్ని వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో పనిచేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులు వారి కుటుంబ సభ్యులు వినియోగించు కోవాలని ఆయన అన్నారు. పూర్తి వివరాలు హాస్పిటల్ లో గల మా ఫోన్ 9849981847/9700686060 నంబర్లను సంప్రదించగలరని డా. శ్రీనివాస్ వర్మ అన్నారు.