
బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ పాలన లో ఆలయాలకు పునర్వైభవం వచ్చిందని ,రాష్ట్రం లో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ వారి వారి మత ఆచారాలకు అనుగుణంగా ప్రభుత్వమే పండుగలను నిర్వహించిన ఘనత దేశం లో కేసీఆర్ ఆర్ ప్రభుత్వానిది మాత్రమే అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బొడ్రాయి పండుగ నిర్వచనం అన్నారు. గురువారం కోదాడ పట్టణం శ్రీరంగాపురంలో కన్నుల పండుగగా సాగుతున్న బొడ్రాయి, సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల, అంకమ్మ,ముత్యాలమ్మ తల్లి, పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవము అనేది మహాలక్ష్మి అంశ అన్నారు. బొడ్రాయి అనేది గ్రామ దేవతలకు ప్రతినిధి అన్నారు..ఊరి భౌగోళిక పరిమాణం, ఊరి నిర్మాణం పైన ప్రజలాంటిదరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పండుగ చేస్తారని ఆయన అన్నారు.ప్రతీ ఒక్కరు తమ తమ మత ఆచారాల కు అనుగుణంగా దైవ చింతనను కలిగి ఉండాలని తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఎమ్మెల్యే అన్నారు. అందులో భాగంగానే ఆడపడుచులను సైతం పిలుస్తారని… ఊరిలోని వారంతా కలిసి ఐక్యమత్యంగా ఉండాలని ఊరి బాగు కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాలనేది దీని వెనక ఉన్న ప్రధాన ఆంతర్యం అని ఎమ్మెల్యే అన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని ఆలయాల పున:ప్రతిష్ట ఎంతో వైభవంగా కొనసాగుతున్నదన్నారు. తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక అన్ని మతాల కు , కులాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వమే స్వయంగా అన్ని పండుగలను నిర్వహించడం దేశం లో మరెక్కడా లేదన్నారు. ఇదంతా తెలంగాణ ప్రజల పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న ప్రేమ అని కొనియాడారు.
గ్రామాల్లో సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు.ఎప్పుడూ ఆధ్యాత్మిక కాంతితో వెలుగొందే గ్రామాలు అబివృద్ది చెందాలనీ . దేవతా మూర్తుల అశీస్సులు గ్రామం లోని ప్రతీ ఒక్కరి పై వుండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ రైతు బంధు అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, ఎంపీపీ కవిత రెడ్డి, స్థానిక కౌన్సిలర్ కందుల చంద్రశేఖర్, పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరావు, నాయకులు ఒంటిపులి శ్రీనివాస్, ఖదీర్, రహీం, నిజాం, నరేష్, బి ఆర్ యస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.