mulugu news telugu galam news e69news llocal news sethakka news
నేతకాని హక్కుల పరిరక్షణ సంఘం
మంగపేట మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఇక్కడ నిర్వహించినప్పుడు పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యవంతంగా ఉండటం జరిగింది ఎప్పుడైతే ఇక్కడినుండి మల్లంపల్లి తరలించడం జరిగినదో పిల్లలకు అక్కడి వాతావరణం బాగా లేకపోవడం చుట్టూ ప్రహరీ లేకపోవడం మైనింగ్ ఏరియా కావటం వలన అక్కడి గాలి వాతావరణం పిల్లలకు పడక చాలా ఇబ్బందులకు గురై హాస్టల్ నుండి చాలామంది విద్యార్థులు వెళ్లిపోతున్నారు ఇక్కడి నుండి గురుకుల పాఠశాలను కొందరు కావాలని తరలించడం జరిగినదని మల్లంపల్లి ప్రస్తుతం ఉన్న హాస్టల్లో కిటికీలు లేకుండా తలుపులు లేకుండా బాత్రూం లెట్ రూమ్ సౌకర్యం కూడా పూర్తి అద్వాన స్థితిలో ఉండటం వలన విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురై చాలా రకాల వ్యాధులకు గురవుతున్నారు వీటన్నింటిని గుర్తించి కలెక్టర్, ఆర్ సి ఓ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా గుర్తించి వెంటనే మంగపేటకు లేదా ఏటూరునాగారం తరలించవలసిందిగా నేతకాని హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షులు జాడి రాంబాబు తెలియజేయడం జరిగింది. శుక్రవారం రోజున ఏటూరునాగారం మండల కేంద్రంలో నేతకాని హక్కుల పరిరక్షణ సంఘం నాయకులు అందరూ హాజరై ఈ గురుకుల పాఠశాలను అట్టి సమస్యలను గుర్తించి అక్కడినుండి మళ్లీ మంగపేటకు తీసుకువచ్చి విద్యార్థుల బాధలను వారి బంగారు భవిష్యత్తుకు సహకరించాలని ప్రభుత్వానికి మరియు సంబంధిత అధికారులకు నేతకాని కుల సంఘం నాయకులు తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దిగొండ కాంతారావు, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు దుర్గం లక్ష్మీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు పూసల నరసింహారావు, భీం సైనిక దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాడి వెంకట్, నేతకాని సంఘం జిల్లా నాయకులు కొండగొర్ల రాజేష్, చిలుమల రాంబాబు, కుమ్మరి రాంబాబు, కొండగొర్ల శ్రీనివాస్, గాందేర్ల నరసింహారావు, ఎప్పుడు అను పంచతంత్రం పాగ నాగరాజు,సునారికాని బైరేస్ తదితరులు పాల్గొన్నారు