
మిద్దె పాక సుధాకర్ ఆకస్మిక మృతి
జనగామ పట్టణంలో ధర్మకంచలో వీర తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ మిద్దె పాక సిద్దయ్య గారి కుటుంబం సిపిఎం పార్టీ లో ఉండి కార్మిక వర్గానికి పేద ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం ఉద్యమించడంలో సుధాకర్ అగ్ర భాగంలో ఉండేవారు అని మోకు కనకా రెడ్డి అన్నారు . సుధాకర్ భౌతికాయానికి ఎర్రజెండా పథకాన్ని కప్పి ఘనంగా నివాళులర్పించారు .సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులుగా కెవిపిఎస్ జనగామ డివిజన్ కార్యదర్శిగా పిఎన్ఎమ్ జిల్లా అధ్యక్షులుగా పార్టీకి అనేక సేవలు అందించారు అని అన్నారు అంతేకాదు. పేదల ఇండ్ల కోసం ఉద్యమించడంలో ప్రజా పోరాటంలో ముందు భాగాన ఉన్నారు. ప్రజలు సిపిఎం ఉద్యమానికి ప్రజా ఉద్యమాలకు అమరజీవి సుధాకర్ మృతి తీరని లోటని ఆయన విడిచి వెళ్లిన ఆశయాలను ముందుకు తీసుకుపోతామని సంతాప సభలో అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు బొట్ల శ్రీనివాస్. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి .ఇర్రి అహల్య . పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్. జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి. బోడ నరేందర్. పుతుకునూరి ఉపేందర్. మునిగాల రమేష్. బెల్లంకొండ వెంకటేష్. సీనియర్ నాయకులు పిట్టల కుమార్ ఎండి దస్తగిరి . పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం పల్లెల లలిత పందిళ్ళ కళ్యాణి. కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు తుటి దేవదానం పల్లెల శంకర్ బొట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.