
ఈ69 న్యూస్ జఫర్ఘడ్ జనవరి 07
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం లోని తిమ్మంపేట గ్రామానికి చెందిన మంద నర్సయ్య ఇటీవల వృద్యాప్యంతో మరణించగా స్థానిక గ్రామ సర్పంచ్ మంద మల్లయ్య వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 5000/రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో పిలుగుళ్ల రవి, యాదవ సంఘం ఉపాధ్యక్షుడు మంద యాదగిరి,తూల్ల కుమార్,విద్యా కమిటి ఛైర్మన్ కుంభోజి మహాదేవ్,నర్సింగోజు స్వామి,మార్క వెంకటేశ్వర్లు మరియు పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.