మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫీస్ లో ఘనంగా మంగళ గౌరి వ్రతం
Hyderabadఖైరతాబాద్ మహిళలకు చాలా ఇష్టమైంది శ్రావణ మాసం… ముఖ్యంగా పెళ్లైన మహిళలు చాలా ఇష్టంగా జరుపుకునే పండగలు, శుభకార్యాలకు ఈ నెల చాలా ప్రాముఖ్యం. శ్రావణ మాసం అంటేనా అందరికీ ముందుగా గుర్తుకొచ్ఛేది.. “వరలక్ష్మీ వ్రతం”… ఈ వరలక్ష్మీ వ్రతం తరువాత శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం “మంగళ గౌరీ వ్రతం”. దీనిని “శ్రావణ మంగళవార వ్రతం” అని,”మంగళ గౌరీ నోము” అని కూడా పిలుస్తుంటారు. మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తే.., మహిళలు తమ “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని కుటుంబ సుఖ సంతోషాలతో
ఉంటుందని నమ్ముతారు. అందుకనే శ్రావణ మాసమంలో మంగళవారములు వస్తాయో అన్ని మంగళవారాలు వ్రతం ఆచరిస్తూ… మంగళగౌరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ మంగళ గౌరీ వ్రతాన్ని పెళ్లి అయిన స్త్రీలు ఐదు సంవత్సరాలు చేస్తారు. వివాహం ఐన మొదటి సంవత్సరము పుట్టినింటి లోనూ… తరువాత నాలుగేళ్లు అత్తారింటిలోను ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి పండితులు చెబుతున్నారు అని ఈ ఆఫీస్ లో వున్న కాశీ తెలిపారు కంపెనీ ప్రారంభం అయ్యిన తరువాత ఈ వ్రతమును ఆచరించిన మాకు మేలు జరుగడంతో మేము ప్రతి ఏటా ఈ వ్రతమును ఆచారిస్తున్నాము అని కంపెనీ అధినేత పొద్దుటూరి విజయ్ కుమార్ తెలిపారు . ఈ కార్యక్రమంలో చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి అతని సతీమణి పద్మ , మేనేజింగ్ డైరెక్టర్ విజయకుమార్ సౌధమిని , విక్రమ్ దివ్య , మేనేజర్ జ్యోతి ,వైకుంటం ,శంకర్ తో పాటు కంపెనీ లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ రోజు జరిగిన ఈ పూజ కార్యక్రమం కోసం మహిళా ఉద్యోగులు రోజువారిలా కాకుండా తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఈ పూజలో పాల్గొన్నారు