
రాబిన్ హుడ్ ఆర్మీ సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ
మండలంలోని సోలిపేట గ్రామంలో రాబిన్ హుడ్ ఆర్మీ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిరుపేద కుటుంబాలకు నెలకి సరిపడా నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. సంస్థ నిర్వాహకులు మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. మనదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా సంస్థ ఆధ్వర్యంలో వాలంటీర్స్ ఉన్నారని,ప్రతి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంవత్సరం దాదాపు కొన్ని కోట్ల మందికి నిత్యావసర సరుకులు లాంటి సేవలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సోలిపేట గ్రామంలో సర్పంచ్ పోడూరి నవీన్ గౌడ్,సంస్థ నిర్వాహకులు ఎంబి చారి,ప్రియాంక, స్వరూప్, మనోజ్ గ్రామ యువత పాల్గొన్నారు.