హైదరాబాద్: విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టరేట్ ధర్నాలో పాల్గోన్న విద్యార్ధులకు రాష్ట్ర కమిటీ ధన్యవాదములు తెలుపుతుంది. ఈ కలెక్టరేట్ ముట్టడీలు విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము.నేడు సమస్యలు పరిష్కారం కోసం రోడ్లపైకి వచ్చిన విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకుంటే భవిష్యత్ విద్యార్ధి పోరాటాలకు సిద్దం కావాలన్నారు. హైదరాబాద్, మేడ్చల్, భద్రాద్రి కోత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, నల్గొండ, భుపాలపల్లి, హన్మకొండ, ఖమ్మం జిల్లాలలో పోలీసులు అత్యుహ్సం చూపి అక్రమంగా అరెస్టులు చేశారు. పోలీసు స్టేషన్స్ లో నిర్బందించడాన్ని రాష్ట్ర కమిటీ ఖండిస్తుంది. గురునానక్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని పోరాడున్న నాయకత్వం పై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఖండించండి: రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నంలో ఈరోజు అనుమతులు లేకుండా విద్యార్థులు చేర్చుకోని లక్షలు రూపాయాలు వసూళ్లు చేసిన గురునానక్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నంలో ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకత్వాని అరెస్ట్ చేసి, అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఖండిస్తుంది.