రైతుల భాదలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కు పట్టావా
Mulugu
రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన యవుసం బాగు పడ్డ చరిత్ర లేదు
ధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోంది
రైతు వ్యతిరేక కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కు చరమ గీతం పాడాలి
పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది
ఖాస్తులో ఉన్న ప్రతి రైతుకూ రైతు బందు ఇవ్వాలి
ముఖ్య మంత్రి కెసిఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఏక కాలంలో రైతు రుణమాఫీ చేయాలి
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు తహశీల్దార్ కార్యాలయం ఎదుట
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటోన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా తహశీల్దార్ కు వినతి పత్రం అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క గారు
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ
భూమి, వ్యవసాయం,
రైతుల కష్టాలు, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ములుగు తహశీల్దార్ గారికి వినతి పత్రం అందించడం జరిగిందని రాష్ట్రం లో రైతుల పడుతున్న కష్టాలు అంత ఇంత కాదని ధరణి పోర్టల్ తెచ్చి రైతులను మోసం చేస్తున్నారని
ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నది ప్రభుత్వం కాదు
సీఎం ప్రజల ఆస్తుల వివరాలను ప్రయివేటు కంపెనీలకు దారాదత్తం చేశారు.
వ్యక్తుల ఆస్తుల వివరాల సమాచారం రహస్యంగా ఉంచాలి.కానీ ప్రయివేటు వ్యక్తులకు, కంపెనీలకు చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగం అవుతోంది భూములు ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి
ధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోంది.
ప్రభుత్వం తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం
పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలివ్వాలి పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది పెట్టుబడులను గుజరాత్ కు
తరలించుకుపోయేందుకు మోదీ కుట్ర చేస్తున్నారు.
ఇది తెలంగాణకు తీరని నష్టం చేకూరుస్తుంది.
రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం అని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి
బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,బండి శ్రీనివాస్,సహకార చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,ములుగు పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి తో పాటు అనుబంధ మండల, గ్రామ సంఘాల అధ్యక్షులు సర్పంచ్ ఎంపీటీసీ లు మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీ లు కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు