
విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుని అనుగ్రహం మన అందరిపై ఉండాలి
అన్ని విఘ్నలు తొలగి అన్ని కార్యాలు సిద్దించాలని ఆ గణనాథుణ్ణి బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ ప్రార్ధించారు.సోమవారం మండలం లోని రామాపురం గ్రామంలోని న్యూ ప్రెండ్స్ యూత్ సభ్యులకు గణేష్ విగ్రహం పంపిణి చేసి వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….అన్నీ శుభాలకు,కార్యాలకు ఆరంభ సూచికైన ఆరాధ్య దైవమైన గణనాధుడి దీవెనలతో పాడి పంటలు,ప్రకృతి మరింత అభివృద్ధి జరగాలని ఆయన అన్నారు. రాబోయే కాలంలో సకల విఘ్నాలు తొలగి సుఖ, సంతోషాలతో, అష్టఐశ్వర్యాలు ,ఆయురారోగ్యాలతో ప్రజలందరూ విలసిల్లాలని ఆ గణనాధుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని ఆయన అన్నారు.ప్రజలందరి విఘ్ననాలు తోలగాలని ఆయన కోరుకున్నారు.ఆ విఘ్నేశ్వరుని దీవెనతో మనం చేసే కార్యాలు నిర్విఘ్నంగా సాగాలి ఆయన ఆకాంక్షించారు.ప్రకృతి ని దేవుని రూపంలో పూజించే గొప్ప పండగ అని,గణపతినే పూజించాలి, ప్రకృతి సిద్దమైనటువంటి పత్రులు, పూలదండలతో పూజిద్దాం.మన అందరి పై విగ్నేశ్వరుని అనుగ్రహము ఉండాలని ఆయన కోరుకున్నారు. ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని అని సూచించారు. అనంతరం అంజి యాదవ్ ను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు