
సంపద వనాల పనులు వేగవంతం చేయాలి:అడిషనల్ కలెక్టర్ ప్రియాంక
మండలంలోని సిరిపురం, నారాయణపురం గ్రామలలో ఏర్పాటు చేస్తున్న సంపద వనాల పనులను గురువారం జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సంపద వనాల పనుల ను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.అలాగే గ్రామాలలొని పల్లె పకృతి వనాలను ఆమె పరిశీంచారు. మండలం లో జరుగతున్న అభివృద్ధి ని మండల అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఆమె వెంట జిల్లా ఆర్టికల్చర్ అధికారి,ఫారెస్ట్, ఎన్ఎస్పి అధికారులు, పంచాయతీరాజ్ ఏఈ, నారాయణపురం,సిరిపురం సర్పంచులు ఎంపీడీవో, ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.