తల్లాడ మండలం అన్నారుగూడెం సెక్టార్ పరిధిలోని బాలపేట గ్రామంలో గురువారం పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ హాబీబున్నిషా భేగం గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతినెలా పిల్లల బరువు, ఆరోగ్య లక్మిబోజనం, సెంటర్ లొనే చేయాలని వివరించారు. అనంతరం గ్రామ సర్పంచ్ కోసూరు నరసింహారావు మాట్లాడుతూ సరైన పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. గర్భిణులకు సీమంతాలు, అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెక్రటరీ మహేష్, ఆశా కార్యకర్త సులోచన, అంగన్వాడీ ఉపాద్యాయురాళ్లు, వరలక్మి, రుక్మిణమ్మ, సైదమ్మ, గర్భిణులు, బాలింతలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.