పేదల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని అంతమొందించాలి – తల్లాడ మార్చి 03, కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి అందుబాటులో లేకుండా పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో తల్లాడ మండల కేంద్రంలో మహా ధర్నా నిర్వహించినారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా కట్టెల పోయి,కట్టెలతో కావడి, నెత్తిపైన కట్టల మోపుతో మహిళల ఖాళీ గ్యాస్ సిలిండర్లతో ర్యాలీ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూబిజెపి ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచి బడా పారిశ్రామికవేత్తలు ఆదానీ, అంబానీలకు కొమ్ముకాస్తున్నరని వంట గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్య కుటుంబలకు గృహిణిలకు వంట గ్యాస్ గుదిబండగా మారిందని ఆయన అన్నారు.మళ్లీ కట్టెల పోయ్యే సామాన్యునికి దిక్కు అయినదని బిజెపి ప్రభుత్వం వచ్చినంక 13 సార్లు గ్యాస్ ధరలు పెంచిందని గతంలో 450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర నేడు 1200 రూపాయలకు పెరిగిందని మోడీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిసి బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తుందని ఆయన మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వo భారీగా పెంచిన వంటగ్యాస్ ధరలను తగ్గించాలని మండల గులాబీ శ్రేణులు,మహిళలు భారీ నిరసనలతో గ్యాస్ సిలిండర్లు మోస్తూ భారీ ర్యాలీ నిర్వహించి రింగ్ సెంటర్ వద్ద వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు,జడ్పీటీసీ దిరిశాల ప్రమీల,రైతుబంధు మండలఅధ్యక్షులుదుగ్గిదేవర వెంకటలాల్,వైరావ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ దూపాటి భద్రరాజు,సొసైటీ చైర్మన్ అయిలూరిప్రదీప్ రెడ్డి,జోనల్ చైర్మన్స్ దగ్గుల శ్రీనివాస రెడ్డి,కేతినేనిచలపతిరావు,దిరిశాల దాసురావు,ఉపసర్పంచ్ గుండ్ల వెంకటి,బొడ్డు వెంకటేశ్వరరావు,నీలాద్రి ఆలయ డైరెక్టర్ పెరిక నాగేశ్వరావు,పట్టణ అధ్యక్షులు జివిఆర్, సర్పంచులు అయిలూరి లక్ష్మి, బద్ధం నిర్మల,తూము. శ్రీనివాస రావు,సొసైటీ డైరెక్టర్ కంపాటి.జమలయ్య,బి.ఆర్ యస్ యూత్ మండల సోషల్ మీడియా అధ్యక్షులు దూపాటి నరేష్ రాజు,ఎంపీటీసీ రుద్రాక్ష. కో.ఆపెక్షన్ సభ్యులు షేక్. ఈసుబ్,సొసైటీ వైస్ చైర్మన్ రేగళ్ల.సత్యం,సొసైటీ డైరెక్టర్ దగ్గుల.రాజశేఖర్ రెడ్డి, ఎక్కిరాలసుదర్శన్* తదితరులు పాల్గొన్నారు