
సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటూ పోచమ్మ తల్లికి బోనాలు
విద్యాశాఖలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ పోచమ్మ తల్లికి బోనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. గురువారం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరం నుండి ఉద్యోగులు బోనాలు చేసి పోతురాజుల వేషధారణలో పోచమ్మ తల్లికి శివాలయం వరకు ర్యాలీ తీసి నైవేద్యం చెల్లించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జేఏసీ ప్రతినిధులు గోలి రవీందర్ రెడ్డి, తాడోజు రమేష్, బైరగొని దయాకర్ గౌడ్, అంకేశ్వరపు హరిప్రసాద్ మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా శ్రమ దోపిడీకి గురవుతూ విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం మొండిమేకరితో స్పందించకపోవడం విడ్డూరమని అన్నారు. పాలకులు స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు తక్షణమే భారత అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును అనుసరించి ఉద్యోగులందరికీ సమానపని సమాన వేతనం చెల్లించాలన్నారు. మండల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ నూతన పోస్టులు మందులు చేసి వాటిలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమపతీకరించాలని కోరారు. పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం ఇన్స్పెక్టర్లను ఒకేషనల్ టీచర్ గా గుర్తించాలని, 12 నెలల పూర్తి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న సౌకర్యాలు అన్నిటిని వర్తింపజేయాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మేల్కొని సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాలలో వెలుగులు నింపాలని పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు, బోనాలు చెల్లించి మొక్కులు చెల్లించామన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు మేకల సుమలత, పోల రాజేశ్వరి, వీరగోని మంజుల, వడకాని రజిత, రమణ కుమార్, పుష్పలత, మహాలక్ష్మి, కుసుమ రజిత, మహాలక్ష్మి, జ్యోతి, రాధిక, ప్రజ్ఞాపురం వెంకటేశ్వర్లు, జ్ఞానానందం, బాకీ వెంకటేశ్వర్లు, సమ్మయ్య, లింగయ్య, గోరంట్ల యాదగిరి, రొయ్యల రాజు, బక్కం రాజ్ కుమార్, సురేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.