
సిపిఎం విస్తృత ప్రచారం
సిపిఎం గెలుపుతోనే భద్రాచలం అభివృద్ధి సాధ్యమని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు శంకరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి అన్నారు.
భద్రాచలం నియోజకవర్గం అభ్యర్థి కారం పుల్లయ్య గెలుపు కోసం ఎమ్మెల్యే కాలనీ, పలు కాలనీ లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే అమరజీవి కామ్రేడ్ కుంజా బొజ్జి కృషి ఫలితంగా ఏర్పడినది బి సి కాలనీ అని అన్నారు. కాలనీలో మౌలిక సదుపాయాలు రోడ్లు కరెంటు త్రాగునీరు డ్రైన్లు ఏర్పాటు చేయడంలో కామ్రేడ్ కుంజా బుజ్జి ప్రత్యేక దృష్టి సారించారని ఫలితంగానే ఎంఎల్ఏ కాలనీ అభివృద్ధి చెందిందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చేసింది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచి ఐదేళ్లు అయినా నేటి వరకు ఈ కాలనీ మొహం కూడా చూపించలేదని నేడు వచ్చి అభివృద్ధి చేస్తానని చెబుతూ ఓట్లు అడగడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.. నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం పార్టీ అభ్యర్థి కారం పుల్లయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని సిపిఎం గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఐలు జిల్లా అధ్యక్షులు యం . వి ప్రసాదరావు,పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు నాదెల్ల లీలావతి, బండారు శరత్, కమిటీ సభ్యులు డి సీతాలక్ష్మి, సత్య ,సీనియర్ నాయకులు ఎం వి ఎస్ నారాయణ, శాఖ కార్యదర్శిలు డి రామకృష్ణ కనక శ్రీ, ప్రజానాట్యమండలి నాయకురాలు గౌతమి, సభ్యులు రుక్మిణి, లక్ష్మికాంతా తదితరులు పాల్గొన్నారు..