సిపిఎం పార్టీ అభ్యర్థి ఎం దశరధ్ ను గెలిపించాలిసిపిఎం పార్టీ అభ్యర్థి ఎం దశరధ్ ను గెలిపించాలి

ముషీరాబాద్ నియోజకవర్గంలో సిపిఎం పార్టీ అభ్యర్థి ఎం దశరధ్ ను గెలిపించాలని సిపిఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు ముషీరాబాద్ కవాడిగూడ డివిజన్ భీమ మైదానం బస్తీలో పాదయాత్ర ప్రారంభ సభలో మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజలకు రక్షణగా ఉంటున్నటువంటి అభ్యర్థి ఏం దశరథ్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈరోజు ఈ నియోజకవర్గంలో నాలుగు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి వారు డబ్బులు ఇస్తే ఓటు వేస్తారని నమ్మకంతో ఈ రోజు వారూ డబ్బులను నమ్ముకున్నారు కావున గెలిచిన తర్వాత ప్రజల సమస్యలు కాదు డబ్బులు సంపాదించుకునే పద్ధతిలో వాళ్లు కొనసాగుతారు అన్నారు కానీ ఈరోజు సిపిఎం పార్టీ ఓటేస్తే డబ్బులు పంచరు కదా వాళ్ళు గెలవరు అని అంటున్నారు కానీ ఈరోజు మీరు వేసే ఓటు ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రతి ఓటుకు ఒక పద్ధతిలో పోరాటానికి సిద్ధమవుతాం కాబట్టి ఇతర పార్టీలకు కాకుండా పోరాటాలు చేసేటువంటి పార్టీకి ఓటు వేస్తే రేపు గల్లబట్టి నిలదీసి పోరాటాలు చేసి సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఉపయోగపడుతుంది అన్నారు. ఈరోజు మతోన్మాద బిజెపి కేంద్రంలో మతం పేరుతోటి ఓట్లు సంపాదించే ప్రయత్నం చేస్తుంది ఇక్కడున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బి.ఆర్.ఎస్ గా మారి ఇయ్యాల ప్రజల పక్షాన ఉంటున్న అంటూ ఈరోజు మతోన్మాద పార్టీకి మద్దతు తెలియజేస్తున్న సందర్భం కేంద్రంలో మోడీ అయినా రాష్ట్రంలో కేసీఆర్ అయినా ప్రజల సమస్యలు పక్కనపెట్టి వాళ్ళ ఆస్తులు కాపాడుకునే పద్ధతిలో ముందుకు కొనసాగుతున్నారు అన్నారు భీమ. మైదానంలో ఇల్లు కూలిపోతున్న ఇక్కడ గెలిచినటువంటి ముఠగోపాల్ ఇప్పటివరకు సమస్యలపై పట్టించుకున్న పరిస్థితి లేదు సిపిఎం పార్టీగా రోడ్ల సమస్య కుట్టు మిషన్లో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యపై రేషన్ కార్డుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసి ఇక్కడ సాధించాము అన్నారు గెలవకుండానే అనేక సమస్యలపై పోరాటం చేసి సాధించినటువంటి సిపిఎం పార్టీ ఈరోజు గెలిస్తే ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కారం చేస్తుందని అన్నారు కావున రేపు 30వ తేదీ జరిగే ఎన్నికల్లో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించినీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ అభ్యర్థి ఎం.దశరథ్ సిపిఎం నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. వెంకటేష్ జిల్లా కమిటీ సభ్యులు విమల సి.మల్లేష్ ,జి.కిరణ్ , మారన్న ,ఆర్ వెంకటేష్ ,నాగలక్మి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింగరావు,అరుణ జ్యోతి బస్తీ వాసులు మణెమ్మ, ఎల్లయ్య మల్లేష్, ,సైదులు,లక్ష్మయ్య ,సోమ ,తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News