
10000 మందితో సీఎం కేసీఆర్ కి కృతజ్ఞత ర్యాలీ
మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 9 మెడికల్ కళాశాలను ఒక్కేసారి వర్చువల్ గా ప్రారంభిస్తున్న సందర్భంగా భూపాలపల్లి శాసన సభ సభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి అధ్యక్షతన 10000 మందితో భూపాలపల్లి హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన కృతజ్ఞత ర్యాలీలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్,రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసు దేవ రెడ్డి, భూపాలపల్లి జిల్లా భారాస పార్టీ అధ్యక్షురాలు & వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి రెడ్డి,భూపాలపల్లి జడ్పీ ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు,గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు హింగే మహేందర్ మరియు వారి తో పాటు ఈ కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. అనంతరం భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసిఆర్ గారు 9 మెడికల్ కళాశాలలను ఒక్కేసారి గౌరవ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మరియు మంత్రి హరీష్ రావు గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వైద్య విద్యార్థులకు ముందుగా శుభాకాంక్షలు చెప్పారు.రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నర్సింగ్,పారా మెడికల్ కోర్సులు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రికి సూచించారు. పారా మెడికల్ కోర్సులకు దేశవ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలతో పేదలు దోపిడీకి గురికాకుండా ఉంటారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ,సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, ఈ విద్యాసంవత్సరం లో సీటు సాధించి ఎంబీబీఎస్ చదవబోతున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.అదే విధంగా దూర ప్రాంతాల విద్యార్థుల కొరకు ఉచిత హాస్టల్ వసతి సదుపాయం ఏర్పాటు చేశామని తెలిపారు.